మీ సకల ఇబ్బందులు తొలగాలంటే ఇలా చేసి చూడండి
హిందూ పురాణాల ప్రకారం, సకల శుభాలు కలగడానికి ,మన హిందూ ధర్మం, విఘ్నపతి అయిన గణేశుడిని, మన పనిని మొదలుపెట్టేముందు ఒక్కసారి, మనస్ఫూర్తిగా, ఏకాగ్రతతో, ఆర్తితో, కింద ఇచ్చిన శ్లోకాన్ని ధ్యానించి వెళ్ళమని చెబుతుంది. దీనివలన మనకు అన్ని ఇబ్బందులు తొలగుతాయి మరియు అన్ని శుభాలు కలుగుతాయి.
ఆ శ్లోకం ఏమిటంటే మన అందరికి తెలిసిన విఘ్నేశ్వర శ్లోకం,మనం చదివేటపుడు తెలియక కొన్ని తప్పులు చదువుతున్నాము, కాబట్టి ఒక్కసారి పద్యాన్ని, దాని భావాన్ని చదివి మీ విఘ్నాలను తొలగించుకోండి.
VIGHNESHWARA SHLOKA (విఘ్నేశ్వర శ్లోకం):
శ్లోకం :
శుక్ల అంబర ధరం విష్ణుం!
శశివర్ణం చతుర్భుజం !!
ప్రసన్న వదనం ధ్యాయేత్!
సర్వ విఘ్నోప శాంతయే !!
అగజానన పద్మార్కం !
గజానన మహర్నిశం !!
అనేకదం తం భక్తానాం !
ఏకదంతముపాస్మహే !!
భావం :
తెల్లటి వర్ణము గలవాడిని,విశ్వవ్యాప్తమైన తేజోమయ శక్తిగల, ప్రసన్నమైన ముఖము గలవాడిని, నాలుగు చేతులు గలవాడిని,అన్ని విఘ్నాలను తొలగించవాడిని ధ్యానిస్తున్నాను.
కదలని కొండకు పుట్టిన పార్వతిదేవి యొక్క పద్మం లాంటి ముఖం సూర్యుని(వినాయకుడి) వలన వికసించినట్లుగా గజముఖమున్నవాడిని ,అన్ని వేళలా, ఏ కోర్కెలనైనా తీర్చేవాడిని ఒకటే దంతం కలవాడిని ఉపాసిస్తున్నాను.
https://youtu.be/6WLng27JqCo?feature=shared
MEANING:I am meditating on the one who is white in color, has universal radiant power, has a pleasant face, has four hands, and removes all obstacles.I worship Goddess Parvati, who was born on the immovable hill, who has a lotus-like face, who has a face like that blossomed by the sun (Ganesha), who always fulfills any desire, who has only one tooth.https://youtube.com/shorts/5hKwPkFtdyk?feature=shared
https://youtu.be/6WLng27JqCo?feature=shared


No comments:
Post a Comment