అలసిపోని కలలతో,
కరిగిపోని కోరికలతో ,
చెరిగిపోని మమతలతో
విసిగి పోని కసితో ,
ఊహించని ఒరవడితో,
కనులు మూత బడుతున్నా ,
కాళ్లు అలసిపోతున్నా
కడుపు కేకలేస్తున్నా,
పట్టు విడవకుండా,
చుట్టూ చూడకుండా,
చీకటి తలుపులు విరిచేసి,
చక్కటి తలపులు కలబోసి,
కష్టాల్ తరిమేసేలా ,
నష్టాల్ నవ్వేసేలా ,
విధిరాతను మార్చేలా,
ఎదురీతను ఎదురించేలా,
ఆనందం అందేలా,
విజయం చెయ్యందేలా,
వెలుగులోకి రా నేస్తం,
వెలితితీర్చునోయ్ నీ విజయం.

No comments:
Post a Comment