ఆలోచిస్తే.. ఏమున్నది.. ఇంకా !
సాధించిన 'స్వరాజ్యమా?
వినిపించే విళయ విలాపమా?
ప్రాపంచిక పాప పరిహాసమా?
ఆలోచిస్తే ఎమున్నది ఇంకా ?
మోసాలకు మూలమా ఈ అవని?
త్యాగాలకు ఫలితమేది మిగిలిందని?
అభాగ్యులకు ఏ దేవుడింక దిక్కని ?
ఆలోచిస్తే ఎమున్నది ఇంకా ?
రైతులేని లోకం ఊహించగలమా?
వారి కష్టానికి కాసంత విలువ ఇస్తున్నామా ?
శ్రమైక జీవులంటే ఈ లోకులకు లోకువా?
ఆలోచిస్తే ఏమున్నది ఇంకా?
ఉన్నవాడు ఉన్నట్టే ఉంటూ ఉంటాడా ?
లేని నాడు లేకుండానే పోతాడా?
బతుకులీడ్చు వారి బాధలింతేనా ?భాదించేనా ?
ఆలోచిస్తే ఎమున్నది ఇంకా ?
ఎదిగే వారంటే ద్వేషం నీకెందుకురా !
ఎదగనీక ఆపి, హేళనింక యేలరా?
ఓ వింతమనషి నీ పాపాలకు అలుపేది?
ఆలోచిస్తే ఏమున్నది ఇంకా?
జవాబు లేని ప్రశ్నలు,
సమరాన రక్తపు మరకలు,
బతుక లేని బతుకులు,
ఆలోచిస్తే ఎమున్నిది ఇంకా?
విళయతాండవ కేళియలు,
మన కాలం కాదిది,
కల కాలం రూపిది, రంగిది!!
Disclaimer:
ఇది కేవలం కల్పితం,ఎవ్వరిని ఉద్దేశించినది కాదు






No comments:
Post a Comment