నవజీవనానికి మొదలు నువ్వు,



జీవిత పథంలో వెలుగు నువ్వు,
కష్టాల్లో ఓదార్పువు నువ్వు,
అడుగడుగునా ధైర్యం నువ్వు,
కుటుంబానికి ఆధారం నువ్వు,
సకల త్యాగాలకు ఆనవాలం నువ్వు,
సమాజానికి హితం నువ్వు,
ప్రతి గెలుపుకి మద్దతు నువ్వు,
తల్లి,సోదరి,ఆలి,బిడ్డలుగా
స్నేహితురాలు, నాయకురాలిగా
ఇలా ప్రతి పాత్రలోనూ అద్భుతం నువ్వు,
నీ గొప్పతనం... మాటల్లో చెప్పలేని అమృతం.
నీ త్యాగం, నీ ప్రేమ, నీ సహనం,నీ ఓర్పు,
ఈ జగత్తును నడిపించే శక్తులు,
మహిళా రూపంలోని మహిమవి, మహాశక్తివి నువ్వు,
ఈ లోకానికి జీవన జ్యోతివి నువ్వు.
అలాంటి మహిళలందరికీ
"మహిళా దినోత్సవ" శుభాకాంక్షలు !!



No comments:
Post a Comment